Wednesday 7 December 2011

నిన్ను కానలేని కనులెందుకు.....
నిన్ను ప్రేమించని హృదయమెందుకు.....
నిన్ను జయించలేని జీవితమెందుకు.....

ఇన్నాళ్ళు ఎక్కడున్నావో తెలీదు నువ్వు...
నా జీవితాన్ని రంగులమయం చెయ్యడానికి ఇప్పుడు వచ్చావా ప్రియా.....
నువ్వు లేని ప్రదేశం అంతా ఖాళీగా,వెలితిగా ఉంది...ఎందుకో ఇలా.....
తరువాత తెలిసింది...ఖాళీగా ఉంది ఆ చోటు కాదు...నా మనసు అని.....

Monday 3 October 2011

వాన...ప్రకృతి పలకరింపు వాన
నల్లని మేఘాల చిలకరింపు వాన...
ఉరుముల ఊరడింపు వాన...
మెరుపులా మురిపాల పాటే వాన...
ఊహలు విలసిల్లింపజేసే  వాన...
హాయిని పెంపొందించే వాన.....
మనిషి ఉరుకుల పరుగుల జీవితానికి ఉల్లాసం వాన...
తల్లిలా తలను తట్టే వాన...
ఎన్నో కలలు పుట్టే కన్నులకు...మరెన్నో ఆసలు చుట్టుముట్టే మనసుకు స్ఫూర్తి,ఆశాజ్యోతి వాన.....       
ప్రయాణం---ఎన్నో పరిచయాలు
మరెన్నో జ్ఞాపకాల కలయికలు...
చిన్నతనంలో ఎన్నో చందమామ,బాలమిత్ర పుస్తకాలు
అందరికంటే ముందు చదవాలని కుస్తీలు.....
కాని జీవితం విలువ తెలిసినప్పుడు దాని అర్థం అర్థమవుతుంది---జీవితం కూడా ఒక ప్రయాణం అని
జీవితంలో కూడా ఎన్నో పరిచయాలు
కొన్ని స్ఫూర్తినిచ్చేవి,కొన్ని గుణపాఠం నేర్పేవి...
ఇంకెన్నో జ్ఞాపకాలు---కొన్ని మధురమైనవి,కొన్ని కటిక చేదువి.....
దూరమైపోవా దూరమా
చేరువై చేరవా నేస్తమా.....
మన స్నేహం కన్నా ఎడబాటు వయసే ఎక్కువ
ఐనా నా మనసులో నీ స్థానాన్ని మరే స్నేహం అధిగమించలేదు.....

Saturday 13 August 2011

పసి పిల్లలు---ఆ మాట వినగానే ఎన్నో బోసి నవ్వులు కళ్ళ ముందు కదలాడి మనసును సేద తీరుస్తాయి.అలాంటి పిల్లలు ఉగ్రవాదానికి,కుటుంబ,మత కలహాలకి,కొందరు స్వయంగా తమ తల్లిదండ్రులు చేసిన తప్పులకు బలవుతున్నారు.కుటుంబానికి పెద్ద దిక్కు అయిన తండ్రి ఈ లోకానికి దూరమైతే,ఆ పసి హృదయం ఎంత తల్లడిల్లుతుందో,ఎంత కలవరపడుతుందో తలచుకుంటేనే కళ్ళు చెమర్చుతాయి.ఇక తల్లిని కోల్పోయిన పిల్లలైతే,ఒక రకంగా చెప్పాలంటే సర్వస్వం కోల్పోయినట్టే ఉంటుంది---ఆ లేత మనసుకు చనిపోవడమంటే అర్థం కూడా తెలీదు.ఆ  పిల్లలను పెంచి,చదివించే బాధ్యత ఒక్క తల్లి మీద పడుతుంది...ఆ కష్టం పగవారికి కూడా రాకూడదు.ఇలాంటి హృదయవిదారకమైన కథలు...నిజమైన కథలు ఎన్నో చూస్తుంటాం.
             ఇక వృద్ధులు---జీవితపు అంచులకు చేరువై గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ గడిపేయలనుకుంటారు.ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ తమ పిల్లలను వృద్ధిలోకి తీసుకువచ్చి చివరకు వృద్ధాప్యపు ఒడిని చేరుకుంటారు.జీవితంలోని ఆఖరి దశను తమ పిల్లలతో,మనవలు,మనవరాళ్ళతో గడపాలని కొండంత ఆశతో ఉంటారు.కన్నబిడ్డలు ఆదరించక బాధపడేవారు కొందరైతే,సమాజంలోని కుళ్ళు,కుతంత్రాలకు సాక్ష్యాలుగా నిలిచిన తమ పిల్లల మరణాలతో కుంగిపోయేవారు మరి కొందరు.ఇలాంటి కలవరపరిచే విషయాలను గురించి కూడా మనం వింటూ ఉంటాం...బాధపడుతుంటాం.....
            ఇలాంటి అభాగ్యులను అక్కున చేర్చుకుంటోంది ఒక సంస్థ---"సృష్టి".నిజానికి దాన్ని సంస్థ అనేకంటే కుటుంబం అంటే సరిగ్గా సరిపోతుంది.ఎందుకంటే ఇక్కడ తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఆప్యాయత దొరుకుతుంది,పిల్లలు దూరం చేసుకున్న తల్లిదండ్రులకి ఆదరణ లభిస్తుంది.పిల్లలు చదువుకుని వృద్ధిలోకి వస్తారు. పెద్దవారు తమ శక్తి ఉన్నంతవరకూ పని చేయడానికి ఉపాధిని కల్పిస్తున్నారు.ఎన్నో జీవితాలు అర్థవంతమౌతాయి.....
            మనం ఎన్నో అనుకుంటాం,ఎంతో బాధపడతాం వీరి గురించి,కాని ఏమీ చేయలేని స్థితి.ఎక్కడ నుండి సహాయాన్ని మొదలుపెట్టాలో తెలియదు,ఎలా చేస్తే అది వారికి ఉపయోగపడుతుందో తెలిదు.వారి భవిష్యత్తు బాగుండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తాం---అది మన ఆశ.దానితోపాటు చేతనైన సహాయాన్ని వారికి అందించాలి---ఇది మన బాధ్యత,మానవత్వం.
            "సృష్టి"ని వెలుగులోకి తీసుకుని వద్దాం.....ప్రపంచాన్ని కాకపోయినా కనీసం మన చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రగతి బాట పట్టిద్దాం.....

Tuesday 26 July 2011

విరిసిన ఒక వానవిల్లే...తల వంచి నిన్ను చూసేనే...నీ పైనే మనసు పడి నిన్నే చేరెనే.....
నువ్ నన్ను చూసిన,నన్నచూసిన క్షణాలే ఓ వరం.....
నువ్ నన్ను తాకగా,నన్నతాకగా నా గుండెలో అల
ఎగసినదీ...  ఎగసిపడే.....
సముద్రమంత లోతులో జనించే ప్రేమ ఊపిరై...
కలా...నిజం...ఇదీ.....
                                                                                           ||విరిసిన||

నువ్వస్తే నా జీవితం...ఓ పూదోటై పూచెనే.....
నువ్ లేనిదే నా జంటగా...నీ జ్ఞాపకం వెంటాదేనే....
నువ్ చూసే చూపుల్లో వెన్నెల వెదజల్లెనే.....
ఎవరో నువ్వేవ్వరో నువ్వేవ్వరో ఏ మాయ చేసావో.....
ఎవరో నువ్వేవ్వరో నువ్వేవ్వరో నీ మాయలో పడి...మరచినదే నా మనసే.....
నా కళ్ళలోని ఆశలు...నా గుండెలోని ఊసులూ.....
ఇలా నీకై వేచే.....
                                                                                           ||విరిసిన||
నీ ఎదలోన నేనులే...నా బ్రతుకేమో నీదిలే.....
నా తోడుగా నా నీడగా ఇలాగ నువ్వు ఉండగా.....
నీ తేనె పలుకుల్లో ప్రేమ విలసిల్లెనే.....
ఏ చోటనో మరి...నువ్ లేనిది...నా గుండెలో ప్రేమ.....
ఏ పూటనో మరి...నిను చూడక...నా రోజు గడిచినదీ.....
కొత్త కొత్తగా...సరికొత్తగా.....
నీలాల నింగి పైన ఓ జాబిల్లి లాంటి రూపము...
నీదే...నీదే...ప్రేమా.....
                                                                                                                       



Thursday 21 July 2011

ఒక వ్యక్తి మీద అభిమానం,గౌరవం ఉండచ్చు.....
 ఒక వ్యక్తి మీద ప్రేమ ఉండచ్చు.....
మరొక వ్యక్తితో స్నేహం  ఉండచ్చు.....
వీటిలో  ఏది ముఖ్యమో తేల్చుకోవడం ఎంతో కష్టం.....
మనిషి  ఎంత ఎదుగుతున్నా వాటి విలువలను గ్రహించడంలో మాత్రం రోజు రోజుకి దిగాజారిపోతున్నాడు.....
అభిమానం ఉన్న చోట కోపం  ఉండదు.....
నిజమైన స్నేహం ఉన్న చోట మనస్పర్ధలు ఉండవు.....
ప్రేమ ఉన్న చోట మాత్రం,కొన్ని సందర్భాల్లో అసూయ ఉండచ్చు కానీ అనుమానం ఎన్నటికీ ఉండదు.....

ఇవన్నీ నిజమని అనుకుంటున్నాను.....మరి మీరు?????


Monday 27 June 2011

కనులు చూసే ప్రతీదీ నిజం కాదు...
మనసు స్పందించే ప్రతి భావం ప్రేమ కాదు...
నిజం ఎప్పుడు వెలుగులోకి వస్తుందో,వెలుగునిస్తుందో ఎవరికీ తెలియదు.....
అలాగే ప్రేమ ఎప్పుడు,ఎందుకు,ఎలా పుడుతుందో ఏ మనసుకీ తెలియదు.....

అపార్ధాలు,కాలం దూరాన్ని పెంచుతున్నాయి...
కానీ భూమ్యాకాశాలకి ఉన్నంత వ్యత్యాసం ఉంది...
అపార్ధాలు మనసుల్ని  దూరం చేస్తాయి.....
కాలం---మనుషులనే దూరం చేస్తుంది.....
అపార్ధాలు దూరమైతే కాలం కూడా ఆ మనసుల వెంట వస్తుంది.....

Tuesday 7 June 2011

నువ్వే నువ్వే నాతో నువ్వే,నాలో సగమై నిలిచావే.....
చాలే చాలే మాయలు చాలే,నన్నే నువ్వు దోచేసావే.....
నా అడుగడుగునా నీ జ్ఞాపకమే నన్నే నీడై నడిపిందే...
నా ఆణువణువూ నను మరిపిస్తూ నీ తలపులతో నిండినదే...
                                                                             ||నువ్వే నువ్వే||
మనసును మీటినది,ఆశలు రేపెనది,కారణమేమిటని అడిగా నిను చూసి
నీ మనసు చెప్పె నాతో,ఒక తీపి కబురు ఏదో...
నీకోసం నా హృదయం
నీతోనే జీవితము
నీవేలే నా సర్వం...నీవేలే.......
                                                                            ||నువ్వే నువ్వే||
కలలను చూపినది,కలతలు రేపెనది,దీనికి సాక్ష్యములు నీ నీలి కనులేనే...
నా కనుల తెరల వెనుకా,నీ రూపమే నిండెనుగా...
నిను చూసే ఈ నిమిషం
నాకే ఓ మరు  జన్మం 
అయ్యావే నా ప్రాణం...చెలి నీవే......
                                                                           ||నువ్వే నువ్వే|| 






Wednesday 1 June 2011

నీకై అన్వేషించాను,ప్రేమించాను,నిరీక్షించాను...
ప్రతి పథంలో ఒక అందమైన అనుభూతి మిగిలింది,మదిలో ఎన్నో కలలు మెదిలాయి....
అన్వేషణలో---
వెతికాను..వెతికాను.....అన్ని దారులలో నిన్ను వెతికాను.....
అణువణువూ వెతికాను...
ఆ పయనంలో,వేస్తున్న ప్రతి అడుగు మన మధ్య దూరాన్ని తగ్గిస్తోందనే భావన..
నేను నిన్ను చేరుకోబోతున్నాననే సంతోషం నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి..... 
తుదికి నా కల నిజమైంది,నీ జాడ తెలిసింది.....
నా ఆనందానికి అవధులు,నిన్ను చేరుకునే పయనంలో అవరోధాలు,అన్ని తొలగిపోయాయి.....
ప్రేమలో---
ఎవరో చెప్పినట్టుగా 
ఒక యుగం క్షణంలా గడుస్తున్నట్టు ఉండేది...
ఎదురుగా నువ్వుంటే మనసులోని ఎన్నో భావాలు నీకు తెలియపరచాలనుకుంటాను...
కానీ ఆ క్షణం నాకు మాటలే కరువౌతాయి... 
ఎందుకిలా అని నా మనసుని అడిగితే,అది జవాబు చెప్పకనే చెప్పింది..బిడియం అని 
ఈ ఆనందం జీవితాంతం కోరుకుంటున్నాను అని.....
నిరీక్షణలో---
నిజం చెప్పాలంటే క్షణం ఒక యుగంలా గడిచింది...
కానీ ఎదురుచూపు ఇంత మధురంగా ఎప్పుడూ అనిపించలేదు...
నువ్వు,నీ జ్ఞాపకాలతో ఈ నిరీక్షణ కాలం,నా జీవితంలో ఒక తీయని జ్ఞాపకంగా నిలిచిపోయింది...
        ఇప్పుడు,ఈ క్షణంలో నీ మనస్సు,ప్రేమ నాకు దక్కాయి...నా సంతోషం నన్ను వెతుక్కుంటూ వచ్చింది.....
ఈ భావాలు అందరికి తెలిసినవే,అందరు పొందుతున్నవే...కానీ ఇదంతా చదువుతున్నప్పుడు మొహంలో వచ్చే ఒక చిరునవ్వు కోసమే ఈ మధుర భావాలు అందరికి చెప్పాలనిపించింది.....

Monday 30 May 2011

సృష్టికి మూలం మగువ
శిశువుకు తొలి స్పర్శ అందించేది మగువ
తొలి రుచిని అందించేది మగువ
ధైర్యానికి మారు రూపం మగువ
సహనానికి మరో రూపం మగువ
తల్లిగా కడుపులో దాచుకుంటుంది
తోబుట్టువుగా మనసులో నిలుపుకుంటుంది
భార్యగా చితి వరకు తోడుగా నిలుస్తుంది.....   
నా మనస్సు నీ చూపుకి మాత్రమే దూరమైంది.....
నా కళ్ళు నీ నవ్వుకి మాత్రమే దూరమయ్యాయి.....
కానీ నా ఈ జన్మ నీ ప్రేమకే దూరమైంది.....
 

Sunday 29 May 2011

కళ్ళలోని ఆరాటం ఎదురు చూస్తోంది నిన్ను వీక్షించడానికి.....
పెదవులు పరితపిస్తున్నాయి నీతో మాట్లాడటానికి.....
మనసులోని ఆవేదన నిరీక్షిస్తోంది నీ ముందు నిలవడానికి.....

Friday 27 May 2011

ఊహలా కనిపిస్తావు,ఉప్పెనై వస్తావు...
పువ్వులా పరిమళిస్తావు,మరు నిమిషం ముల్లువై గాయపరుస్తావు...
నవ్వుతో కవ్విస్తావు,మరు క్షణం నిప్పులు కురిపిస్తావు.....

Thursday 26 May 2011

                                                      నేటి కుల వ్యవస్థ


     కులం-----ఇది నేటి సమాజంలో ప్రధాన సమస్యగా మారింది.పూర్వం రెండే రెండు జాతులు ఉండేవి-ఆడ,మగ.మరి ఇప్పుడు ప్రతి వీధికి ఒక కులం ఉంది.ఇది కేవలం ఒక రంగానికి మాత్రమే పరిమితం కాదు.అన్ని రంగాల్లోనూ ఈ మహమ్మారి ఊపందుకుంది.ఈ మధ్య కాలంలో మరీనూ.....
  ఈ రోజుల్లో,ఏ మనిషికైనా తన కులంవాడు చేసే ఎటువంటి నీచమైన పనైనా,వేసే వెర్రి వేషాలైనా అర్ధవంతంగా ఊహించుకుని సమర్ధిస్తుంటాడు.ఈ కులం మాయలో పడి తన వివేకాన్ని మర్చిపోయి ఎదుటి కులంవాడు మంచి చేసినా చెడుగా కనిపించి దూషిస్తాడు.అసలు ఈ కులానికి మూలకారకుడు ఎవరు?---ఇది పెద్ద చిక్కు ప్రశ్న కాదు,మానవుడే.అలాగే దీన్ని అరికట్టే ఆయుధం కూడా అదే మానవుడు.నాడు ఆంగ్లేయులు మన దేశ ప్రజలని నల్లవారిగా పరిగణిస్తే,మనం వారికంటే దిగజారి మనిషి జాతి,కుల,వర్ణ విభేదాలు ఎంచి ఈ కులం అనే దారిద్ర్యాన్ని తెచ్చిపెట్టుకున్నాము.ఇద్దరి మనసులకి మధ్య అడ్డుగోడలు ఉండవచ్చు కానీ ఇద్దరు మనుషుల మధ్య కులాలగోడలు ఉండకూడదు.ఎంతోమంది పెద్దలు మరియు స్వాతంత్ర్య సమరయోధులు దేశ సమైఖ్యత గురించి చెప్పారు కానీ కులాల గురించి చెప్పలేదు.పాపం..వారు ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో ఎదురవుతాయని అనుకుని ఉండరు-లేకుంటే దాని గురించి కూడా ప్రజలకి చాటిచేప్పేవారేమో!ఏదేమైనా ఇటువంటి సమాజంలో వారు ఇప్పుడు లేనందుకు అద్రుష్టవంతులనే చెప్పుకోవచ్చు.ఇందులో దురద్రుష్టకరమైన మరియు బాధాకరమైన విషయం ఏంటంటే అసలు ఈ కుల పట్టింపులతో ఏం సాధిస్తున్నారో  వారికే అర్దం కాదు.
      ఇది ఇలాగే నిరంతరాయంగా సాగిపోతూ ఉంటే భవిష్యత్తులో coastal andhra కాస్త 'cast'al andhra గానూ,తెలంగాణ కాస్త 'కులం'గాణగా,రాయలసీమ కాస్త గొడవలతో 'రక్తాలసీమ'గా మారే అవకాశాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.
                    రండి!!!ఈ కులాలగోడలను సమూలంగా కూల్చివేద్దాం!!!

Tuesday 24 May 2011

నీ రాకతో సరస్సు లాంటి నా హృదయం పరవళ్ళు తొక్కింది
ఎటు వెళ్తోందో,ఎలా వెళ్తోందో తెలీదు
అది సముద్రం లాంటి నీ మనసుని చేరుకోవాలని ఎదురు చూస్తోంది

నిన్ను చూసిన వేళ,నా గుండె చప్పుడు కాంతి వేగంతో సమమైంది.....
నిన్ను తలచిన వేళ ఎద కేరింతలు కొట్టే పాపాయితో పోటి పడింది.....
నిన్ను చూడని వేళ మనసు అలజడుల సముద్రం అయింది.....
నువ్వు దూరమైన వేళ హృదయం చలనం లేని పాషాణం అయింది.....