Thursday 6 September 2012


అభిమానం బంధం ప్రేమ
నేను పుట్టినపుడు తొలిసారిగా నువ్వు ఎత్తుకున్నప్పటి స్పర్శ
నన్ను ఆడించినప్పటి ఆనందం
నా చెయ్యి పట్టుకుని నడిపిస్తూ నడకని నేర్పించినప్పటి సంతోషం
ప్రతి నిమిషం ప్రతి విషయంలో నాతో నిలిచి నువ్వు పెంచిన ఆత్మవిశ్వాసం
ఎదిగాక ప్రతి విషయం నాతో పంచుకునే స్వభావం
నాకు దూరమయ్యేటప్పుడు నీ మనసులో బాధ.....
ఇదంతా ప్రేమే ఐతే...
నీకోసం చూసే ఈ ఎదురుచూపు కూడా ప్రేమే
Miss u akkaaa... :(

Sunday 24 June 2012


నువ్వు నావైపుగా చూసే ప్రతి చూపులో వెతుకుతుంటాను...వాటిలో ఒక్కటైనా నన్ను ప్రేమగా తాకదా అని.....
నువ్వు పలికే ప్రతి మాట కోసం ఎదురు చూస్తుంటాను...అందులో ఒక్కటైనా నన్ను ప్రేమిస్తున్నాను అని ఉండకపొతుందా అని.....

Thursday 14 June 2012


నా కళ్ళలోని రూపం నువ్వు...
నా ఊహలకి చిత్రం నువ్వు...
నా ఆరాధనకి అర్థం నువ్వు...
నా ఆలోచనలకి ప్రాణం నువ్వు...
నా గెలుపుకి స్థైర్యం నువ్వు...
నా ఓటమికి స్ఫూర్థి నువ్వు...
నా ఒప్పుకి ప్రోత్సాహం నువ్వు...
నా తప్పుకి విమర్శ నువ్వు...
నా మొత్తం జీవితానికే కథనం నువ్వు...

వీటన్నిటిలో ఒకప్పుడు తోడుగా ఉన్న నువ్వే నాకు కన్నీళ్ళలో కూడా "తోడు"గా ఉంటావనుకున్నాను...కాని వాటికి "కారణం" అవుతావని ఎప్పుడూ అనుకోలేదు.....

Wednesday 30 May 2012

బాధ - కన్నీరు

బాధ కన్నీటితో చెబుతోంది.....

బాధ:-      నాకు చాలా బాధగా ఉంది...ఏం చేయాలో తేలీట్లేదు...

కన్నీరు:-   ఎందుకు...ఎమైంది?

బాధ:-     అందరూ నా వల్లే విచారంగా ఉంటారు...అది నా మనసుని తొలిచేస్తోంది..మనసు చాలా భారంగా ఉంది

కన్నీరు:-   నీ భారం తీరేదాకా నేనూ నీతో వస్తాను...నీ వల్ల విచారంగా ఉన్నవారందరికి ఆ భారం తగ్గేదాకా వారితోనే ఉంటాను...నీ కష్టాన్ని నేను పంచుకుంటాను.....

మన మనసులో బాధ ఉంటే...ఎవరికైనా చెబితేకానీ,తనివితీరా ఏడిస్తే కానీ తేలికగా ఉంటుంది అంటారు...ఇప్పుడు "బాధ" అదే చేసింది,తన బాధని కన్నీటితో చెప్పుకుంది.

అందుకే బాధ,కన్నీరు ఎప్పుడు జంట పదాలలాగా కలిసుంటాయి.....