Wednesday 30 May 2012

బాధ - కన్నీరు

బాధ కన్నీటితో చెబుతోంది.....

బాధ:-      నాకు చాలా బాధగా ఉంది...ఏం చేయాలో తేలీట్లేదు...

కన్నీరు:-   ఎందుకు...ఎమైంది?

బాధ:-     అందరూ నా వల్లే విచారంగా ఉంటారు...అది నా మనసుని తొలిచేస్తోంది..మనసు చాలా భారంగా ఉంది

కన్నీరు:-   నీ భారం తీరేదాకా నేనూ నీతో వస్తాను...నీ వల్ల విచారంగా ఉన్నవారందరికి ఆ భారం తగ్గేదాకా వారితోనే ఉంటాను...నీ కష్టాన్ని నేను పంచుకుంటాను.....

మన మనసులో బాధ ఉంటే...ఎవరికైనా చెబితేకానీ,తనివితీరా ఏడిస్తే కానీ తేలికగా ఉంటుంది అంటారు...ఇప్పుడు "బాధ" అదే చేసింది,తన బాధని కన్నీటితో చెప్పుకుంది.

అందుకే బాధ,కన్నీరు ఎప్పుడు జంట పదాలలాగా కలిసుంటాయి.....