Thursday, 28 February 2013

రెప్పపాటు కాలం జీవితం ఐతే ,
కనురెప్ప వేయకుండా  నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను ..... 

Saturday, 23 February 2013

ప్రేమ,నమ్మకం,గౌరవం... బంధానికి తొలి మెట్లు
నమ్మకం లేని చోట ఒంటరితనం చుట్టుముడుతుంది.....
గౌరవం లేని వేళ నిరాశానిస్పృహలు  అలముకుంటాయి ....
నమ్మకం గౌరవం  ఉన్నప్పుడు బంధానికి పునాది పడుతుంది,ప్రేమ ఆ బంధాన్ని జీవితాంతం నిలబెడుతుంది..... 

Wednesday, 13 February 2013

నిరంతరం శూన్యం నన్ను పలకరిస్తున్నా...
అనుక్షణమైనా తారలు నా దరి చేరకపోయినా...
నీ ఎడబాటు నన్ను కలచివేస్తున్నా...
మనతో పెనవేసుకున్న ఆ జ్ఞాపకాలని మాత్రం ఎన్నడూ దూరం చేసుకోలేను.....