Saturday, 16 March 2013


చిరుజల్లు లాగా తొలకరిలో రాగా తను ఏదో మాయె చేసింది లే...
నడిచేటి దారి తన వెంట రాగా తన దారి నీతో నడిచేను లే...
ఇది స్వర్నమా లెక పున్నమా,ఏ వర్నమో తేలేదెలా...
ఇది అందమా మరు చంద్రమా,ఈ మధురిమా తెలిసేదెలా.....

నిను చూసే వేల యెదలో ఈ సవ్వడులూ,వినలేద నువ్వు నాలో అలజడులు...
కన్నుల్లో ఏదో మర్మం దాగి ఉన్నది,మాటల్లో తెలుపనేలేని మంత్రమున్నది...
కలలలోన నిన్నే కనగా కవినయ్యాను లే,ఇలలలొన నువ్వే ఎదురై సిలనయ్యాను లే.....

పరుగున నడిచేనే నీతొ నా అడుగు,వీల్లేదంటున్నా మళ్ళదు గా నా వైపు...
నీతో నీ నీడ లాగా పయనించేనే,నా హ్రుదయం నీ ఊసులనే నాకు చెప్పెనే...
నిదురలోన ఐనా విడనేలేదు నన్ను,కొంటెగ నను చూసి కాల్చే నీ రూపం.....

Wednesday, 6 March 2013


సమస్త ఝరులు సముద్రాన్ని ఆశ్రయించనినాడు,
సూర్యుడు ఉదయించనినాడు,
చూపుని కన్ను చిన్నచూపు చూసిననాడు...
మనుషులు మనసులని వీడి జీవఛ్ఛవాలుగా మిగిలిననాడు...
తల్లి ప్రేమ జగతిలో అంతరించిననాడు...
ఇవన్నీ జరిగిననాడు చెప్పు నిన్ను మరచిపోమని.....

Tuesday, 5 March 2013

హృదయ సంద్రంలో ఆశల కెరటాలు ఎగసిపడుతున్నాయి .
అవి నీ పదములను  స్పృశించాలని ఆరాటపడుతున్నాయి..... 

Thursday, 28 February 2013

రెప్పపాటు కాలం జీవితం ఐతే ,
కనురెప్ప వేయకుండా  నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను ..... 

Saturday, 23 February 2013

ప్రేమ,నమ్మకం,గౌరవం... బంధానికి తొలి మెట్లు
నమ్మకం లేని చోట ఒంటరితనం చుట్టుముడుతుంది.....
గౌరవం లేని వేళ నిరాశానిస్పృహలు  అలముకుంటాయి ....
నమ్మకం గౌరవం  ఉన్నప్పుడు బంధానికి పునాది పడుతుంది,ప్రేమ ఆ బంధాన్ని జీవితాంతం నిలబెడుతుంది..... 

Wednesday, 13 February 2013

నిరంతరం శూన్యం నన్ను పలకరిస్తున్నా...
అనుక్షణమైనా తారలు నా దరి చేరకపోయినా...
నీ ఎడబాటు నన్ను కలచివేస్తున్నా...
మనతో పెనవేసుకున్న ఆ జ్ఞాపకాలని మాత్రం ఎన్నడూ దూరం చేసుకోలేను.....