Sunday, 24 June 2012


నువ్వు నావైపుగా చూసే ప్రతి చూపులో వెతుకుతుంటాను...వాటిలో ఒక్కటైనా నన్ను ప్రేమగా తాకదా అని.....
నువ్వు పలికే ప్రతి మాట కోసం ఎదురు చూస్తుంటాను...అందులో ఒక్కటైనా నన్ను ప్రేమిస్తున్నాను అని ఉండకపొతుందా అని.....

Thursday, 14 June 2012


నా కళ్ళలోని రూపం నువ్వు...
నా ఊహలకి చిత్రం నువ్వు...
నా ఆరాధనకి అర్థం నువ్వు...
నా ఆలోచనలకి ప్రాణం నువ్వు...
నా గెలుపుకి స్థైర్యం నువ్వు...
నా ఓటమికి స్ఫూర్థి నువ్వు...
నా ఒప్పుకి ప్రోత్సాహం నువ్వు...
నా తప్పుకి విమర్శ నువ్వు...
నా మొత్తం జీవితానికే కథనం నువ్వు...

వీటన్నిటిలో ఒకప్పుడు తోడుగా ఉన్న నువ్వే నాకు కన్నీళ్ళలో కూడా "తోడు"గా ఉంటావనుకున్నాను...కాని వాటికి "కారణం" అవుతావని ఎప్పుడూ అనుకోలేదు.....