కళ్ళలోని ఆరాటం ఎదురు చూస్తోంది నిన్ను వీక్షించడానికి.....
పెదవులు పరితపిస్తున్నాయి నీతో మాట్లాడటానికి.....
మనసులోని ఆవేదన నిరీక్షిస్తోంది నీ ముందు నిలవడానికి.....
కులం-----ఇది నేటి సమాజంలో ప్రధాన సమస్యగా మారింది.పూర్వం రెండే రెండు జాతులు ఉండేవి-ఆడ,మగ.మరి ఇప్పుడు ప్రతి వీధికి ఒక కులం ఉంది.ఇది కేవలం ఒక రంగానికి మాత్రమే పరిమితం కాదు.అన్ని రంగాల్లోనూ ఈ మహమ్మారి ఊపందుకుంది.ఈ మధ్య కాలంలో మరీనూ.....
ఈ రోజుల్లో,ఏ మనిషికైనా తన కులంవాడు చేసే ఎటువంటి నీచమైన పనైనా,వేసే వెర్రి వేషాలైనా అర్ధవంతంగా ఊహించుకుని సమర్ధిస్తుంటాడు.ఈ కులం మాయలో పడి తన వివేకాన్ని మర్చిపోయి ఎదుటి కులంవాడు మంచి చేసినా చెడుగా కనిపించి దూషిస్తాడు.అసలు ఈ కులానికి మూలకారకుడు ఎవరు?---ఇది పెద్ద చిక్కు ప్రశ్న కాదు,మానవుడే.అలాగే దీన్ని అరికట్టే ఆయుధం కూడా అదే మానవుడు.నాడు ఆంగ్లేయులు మన దేశ ప్రజలని నల్లవారిగా పరిగణిస్తే,మనం వారికంటే దిగజారి మనిషి జాతి,కుల,వర్ణ విభేదాలు ఎంచి ఈ కులం అనే దారిద్ర్యాన్ని తెచ్చిపెట్టుకున్నాము.ఇద్దరి మనసులకి మధ్య అడ్డుగోడలు ఉండవచ్చు కానీ ఇద్దరు మనుషుల మధ్య కులాలగోడలు ఉండకూడదు.ఎంతోమంది పెద్దలు మరియు స్వాతంత్ర్య సమరయోధులు దేశ సమైఖ్యత గురించి చెప్పారు కానీ కులాల గురించి చెప్పలేదు.పాపం..వారు ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో ఎదురవుతాయని అనుకుని ఉండరు-లేకుంటే దాని గురించి కూడా ప్రజలకి చాటిచేప్పేవారేమో!ఏదేమైనా ఇటువంటి సమాజంలో వారు ఇప్పుడు లేనందుకు అద్రుష్టవంతులనే చెప్పుకోవచ్చు.ఇందులో దురద్రుష్టకరమైన మరియు బాధాకరమైన విషయం ఏంటంటే అసలు ఈ కుల పట్టింపులతో ఏం సాధిస్తున్నారో వారికే అర్దం కాదు.
ఇది ఇలాగే నిరంతరాయంగా సాగిపోతూ ఉంటే భవిష్యత్తులో coastal andhra కాస్త 'cast'al andhra గానూ,తెలంగాణ కాస్త 'కులం'గాణగా,రాయలసీమ కాస్త గొడవలతో 'రక్తాలసీమ'గా మారే అవకాశాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.
రండి!!!ఈ కులాలగోడలను సమూలంగా కూల్చివేద్దాం!!!
Tuesday, 24 May 2011
నీ రాకతో సరస్సు లాంటి నా హృదయం పరవళ్ళు తొక్కింది
ఎటు వెళ్తోందో,ఎలా వెళ్తోందో తెలీదు
అది సముద్రం లాంటి నీ మనసుని చేరుకోవాలని ఎదురు చూస్తోంది
నిన్ను చూసిన వేళ,నా గుండె చప్పుడు కాంతి వేగంతో సమమైంది.....
నిన్ను తలచిన వేళ ఎద కేరింతలు కొట్టే పాపాయితో పోటి పడింది.....
నిన్ను చూడని వేళ మనసు అలజడుల సముద్రం అయింది.....
నువ్వు దూరమైన వేళ హృదయం చలనం లేని పాషాణం అయింది.....